నేను ఎవరికోసం బతకాలి? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లుంటే బావుండు

తిరుపతి నగరానికి చెందిన ఓ వ్యాపారి, ఆయన చిన్నారి కుమార్తె ఆదివారం గోదావరి నదిలో పడవ మునిగిన ప్రమాదంలో గల్లంతయ్యారు. సుబ్రహ్మణ్యం (45), మధులత దంపతులది ముచ్చటైన కుటుంబం. వారికి ఓ పన్నెండేళ్ల కుమార్తె. కుమార్తె హాసిని స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది.

కూతురి మాట వినుంటే.. పెనుప్రమాదం నుంచి బయటపడేవాళ్లే..!

లాంచీలో పాపి కొండలకు వెళ్తూ, దారిలో అస్థికలు కలపాలన్నది వారి ఆలోచన. అయితే.. వాళ్లు ఎక్కిన పడవ పాపికొండలకు వెళ్తూ కచలూరు వద్ద నీటిలో మునిగిపోయింది. సుబ్రహ్మణ్యం, హాసిని నదిలో గల్లంతు కాగా, మధులత మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకుంది.

నేను, నా భర్త, పాప బోటెక్కాం. బోటు మునిగిపోతున్న సమయంలో మునిగిపోతున్నప్పుడు నాభర్త నన్ను, పాపను రక్షించాలని ప్రయత్నం చేశాడు. బోటులో నుంచి తోచేశాడు. లైఫ్‌జాకెట్‌ అందించాడు. నేను అందుకున్నాను, నా కళ్లేదుటే నా భర్త మునిగిపోయాడు. పాప నా కాలు పట్టుకుంది. నేను అందుకునే లోపే జారిపోయింది.
– దుర్గం మధులత

Leave a comment

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *